పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లోనూ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అక్కడి యువ క్రికెటర్లూ విరాట్‌ను ఆరాదిస్తారు. అతడి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. అయితే..ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ (IND vs PAK) వర్షం కారణంగా అభిమానులను నిరాశపరిచినా.. ఓ ఫ్యాన్‌గర్ల్(Virat Kohli Fangirl) విరాట్‌పై తన ప్రేమను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతి శ్రీలంక (Sri Lanka) లోని పల్లెకలె స్టేడియానికి వచ్చింది.
నేరుగా కోహ్లిని చూసి ఎంతో సంబరపడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ 4 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో ఆ యువతి నిరాశ చెందింది. ప్రస్తుతం ఆ యువతి విరాట్ కోహ్లి గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఏం ఉందంటే.. ‘నేను విరాట్ కోహ్లికి పెద్ద అభిమానిని. అతడిని చూడాలని భారత్, పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్‌కు వచ్చాను. అయితే.. విరాట్ శతకం చేయకపోవడంతో నేను నిరాశ చెందా. కోహ్లి తొందరగా ఔట్ కావడంతో నా గుండె పలిగిపోయింది.’ అని ఆ యువతి చెప్పింది. మీరు ఎవరికి సపోర్టు చేస్తారని చెప్పగా.. పాకిస్తాన్‌కే అని అంది.
మరీ బాబర్ ఆజామ్(Babar Azam, విరాట్ కోహ్లిలలో ఫేవరెట్ ఎవరు అని ప్రశ్నించగా ఎలాంటి తడబాటు లేకుండా కోహ్లి అని అంది.ఇది ఇండియా, ఇది పాకిస్థాన్ అంటూ తన చెంపలపై ఓ వైపు పాకిస్థాన్.. మరోవైపు భారత్ జాతీయ జెండా రంగులను చూపించింది. ‘పొరుగువారిని ప్రేమించడం చెడ్డ విషయమేమీ కాదు కదా..?’ అంటూ ఆమె చివర్లో పేర్కొనడం అందరినీ ఆకట్టుకుంటోంది.మరోవైపు పాక్‌లోని బలూచిస్థాన్ (Balochistan)కు చెందిన కొంతమంది ఫ్యాన్స్ కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఇసుకతో విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీశారు. అనంతరం ఆ భారీ చిత్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు. దీంతో కోహ్లీకి పాక్‌లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి.
A Pakistani baba stops this cute girl from loving Virat Kohli & India but this courageous girl gives a befitting reply to him and continues her support for Virat. Hats off to her.#INDvPAK#PAKvINDpic.twitter.com/9nh1M9FPbW