ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. భయపడిపోయన ఆ మహిళ (Women) బయటకు పరుగులు తీసింది. అంతటితో ఆగలేదు ఆ వాలంటీర్ దాష్టీకం. ఈ విషయం ఎవరికైనా చెబితే ఊళ్లో తిరగలేవంటూ ఆ మహిళను బెదిరించాడు. విషయం ఇంట్లో వాళ్లకి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు. వాలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు (Police) దర్యాప్తు చేపట్టారు.నా వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నాడంటూ బెదిరించాడని సదరు మహిళ ఆరోపించింది.ఇతర మహిళలతో కూడా ఇలానే ప్రవర్తిస్తాడని పింఛన్లు (Pensions)ఇచ్చే నెపంతో ఇళ్లలోకి వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వాపోయారు.