చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ సూపర్ విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఇస్రో ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్ఎక్స్లో వెల్లడించింది.తాము ఇచ్చిన కమాండ్‌కు విక్రమ్ (Vikram) సక్రమంగా స్పందించినట్లు ఇస్రో తెలిపింది. ఆగస్టు 23వ తేదీన తొలిసారి చంద్రుడి దక్షిణ ద్రువంపై విక్రమ్ ల్యాండైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మిషన్
(Mission) లక్ష్యంలో భాగంగా ఆ ల్యాండర్‌ను మరో చోట దించారు. దీని కోసం నిర్వహించిన హాప్ ఎక్స్పరిమెంట్ విజయవంతం అయినట్లు ఇస్రో తెలిపింది. కమాండ్ ఇచ్చిన తర్వాత విక్రమ్ ల్యాండర్ (Lander) ఇంజిన్లు ఫైర్ అయ్యాయని, ఆ తర్వాత ఆ ల్యాండర్ దాదాపు 40 సెంటీమీటర్ల మేరకు పైకి లేచి.. సుమారు 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో వెల్లడించింది.
ఈ మిషన్‌కు చెందిన వీడియోను కూడా ఇస్రో (ISRO) తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్ చేపట్టిన ప్రయోగం చాలా కీలకమైందని ఇస్రో తెలిపింది. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు ఇది నాందిగా నిలుస్తుందని పెర్కోన్నాది. ఒకవేళ చంద్రుడి నుంచి మళ్లీ భూమ్మీదకు శ్యాంపిల్స్ తీసుకురావాలన్నా, లేక మానవుల తరలింపు ప్రక్రియ చేపట్టాలన్నా, ఇవాళ నిర్వహించిన ప్రయోగాం కీలకమైందని ఇస్రో తెలిపింది.విక్రమ్ ల్యాండర్‌కు చెందిన అన్ని సిస్టమ్స్ నార్మల్‌గా పనిచేస్తున్నట్లు ఇస్రో పేర్కొన్నది. ర్యాంప్‌ను మోహరించామని, చేస్ట్, ఐఎల్ఎస్ఏ (ILSA) పరికరాలు ఫోల్డ్ అయ్యాయని, పరీక్ష పూర్తి అయిన తర్వాత అవి మళ్లీ యధావిధిగా తమ పని చేస్తున్నట్లు ఇస్రో చెప్పింది.
అయితే ఏ దేశం కూడ ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకలేదు. అయితే చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు (Scientists) ప్లాన్ చేశారు.ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగించారు. ఐదు దఫాలు కక్ష్యను పొడిగించారు. ఐదో కక్ష్య పూర్తైన తర్వాత ఈ నెల 1వ తేదీన చంద్రుడి మార్గంలో చంద్రయాన్-3 ప్రవేశ పెట్టారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 (Chandrayaan-3) ని విజయవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత కక్ష్యలను క్రమంగా తగ్గించారు. ఈ క్రమంలోనే చంద్రుడి దగ్గరికి చంద్రయాన్-3 తీసుకు వచ్చారు.