»Former Solicitor General Harish Salves Third Marriage In London
Harish Salve: 68 ఏళ్ల మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే మూడో వివాహం
ప్రముఖ భారత లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన మూడవ వివాహాన్ని లండన్‌లో ముఖ్య అతిథుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ మ్యారెజ్కు ఇండియా నుంచి ప్రముఖులు హాజరు కావడం విశేషం.
Former Solicitor General Harish Salve's third marriage in London
Harish Salve: భారతదేశ(India) ప్రముఖ లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్(Solicitor General) గా పనిచేసిన హరీష్ సాల్వే(Harish Salve) మూడోసారి వివాహం చేసుకున్నారు. 68 ఏళ్ల సాల్వే, త్రినా(Trina) అనే మహిళను లండన్(London)లో పెళ్లాడారు. తన మొదటి భార్య మీనాక్షితో విడిపోయిన తరువాత 2020లో కరోలిన్ బ్రస్సార్డ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. మీనాక్షితో దాదాపుగా 3 దశాబ్దాల వివాహబంధానికి 2020లో ముగింపుపలికి విడాకులు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. తాజాగా సాల్వే త్రినాను పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. లండన్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నీతా అంబానీ(Neetha Ambani), లలిత్ మోడీ(Lalith modi), ఉజ్వల్ రౌత్ వంటి ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తోంది.
దేశంలో ప్రముఖ కేసులకు న్యాయవ్యాదిగా వ్యవహరించి టాప్ లాయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ సాల్వే. గూఢచర్యం కేసులో పాకిస్తాన్ లో అరెస్టైన కులభూషన్ జాదవ్ కేసును కేవలం రూ. 1 మాత్రమే తీసుకొని వాదిస్తున్నారు. జాదవ్ కు పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు ప్రస్తుతం ఇంటర్నేషన్ కోర్టులో ఉంది. అలాగే టాటా గ్రూప్, ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి వారు సాల్వేకు క్లయింట్స్ గా ఉన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ పై కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం కేసును కూడా ఈయన వాదించారు. సాల్వే సేవలకు పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం 2015లో ప్రకటించింది. 2002లో సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసును సైతం ఈయనే వాదిస్తున్నారు. నవంబర్ 1999 నుంచి నవంబర్ 2002 వరకు భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన సాల్వే జనవరిలో వేల్స్, ఇంగ్లాండ్ కోర్టులకు క్వీన్స్ న్యాయవాదిగా నియమితులయ్యారు.
Former Solicitor general of India, #HarishSalve got married for the 3rd time. Nita Ambani, Lalit Modi amongst others attended the ceremony.