»Mbsg Wins Durand Cup Final 2023 Title For 17th Time
Durand Cup 2023: టైటిల్ 17వ సారి గెల్చుకున్న MBSG
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆదివారం ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన డురాండ్ కప్ 2023(Durand Cup final 2023) ఫైనల్ మ్యాచులో MBSG జట్టు విజయం సాధించింది. EBFCని 1-0తో ఓడించింది.
23 ఏళ్ల తర్వాత మళ్లీ డ్యూరాండ్ కప్ 2023(Durand Cup final 2023) టైటిల్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్(MBSG) జట్టు గెల్చుకుంది. బెంగాల్‌లోని కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో 1-0 తేడాతో చిరకాల ప్రత్యర్థి జట్టైన ఈస్ట్ బెంగాల్(EBFC)ను ఓడించారు. డిమిత్రి పెట్రాటోస్ 62వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టును విజయతీరాలకు తీసుకెళ్లారు. దిమిత్రి పెట్రాటోస్ చేసిన ఒంటరి గోల్ కారణంగా మోహన్ బగాన్ జట్టు 132వ డ్యురాండ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో MBSG జట్టు కెప్టెన్ సుభాసిష్ బోస్ రూ.60 లక్షల చెక్కును స్వీకరించారు. మరోవైపు ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు రన్నరప్ పతకాలను అందుకున్నారు.
ఆసియాలోని పురాతన ఫుట్ బాల్(football) క్లబ్ టోర్నమెంట్ అయిన డ్యురాండ్ కప్ ను రికార్డుస్థాయిలో మోహన్ బగాన్ జట్టు 17వసారి గెల్చుకోవడం విశేషం. ఈ జట్టు చివరిసారిగా 2000లో గోల్డెన్ గోల్ ద్వారా మహీంద్రా యునైటెడ్‌ను ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. మోహన్ బగాన్ 2004లో డ్యూరాండ్ కప్ ఫైనల్ కు చేరి ఈస్ట్ బెంగాల్‌తో 1-2 తేడాతో ఓడిపోయింది.