»Heath Streak Death After Fighting With Cancer Zimbabwe Cricket Team
Heath Streak: క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన స్టార్ క్రికెటర్.. 49 ఏళ్ల వయస్సులో కన్నుమూత
కొన్ని రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తను జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్రీ ఒలాంగా అందించాడు. అయితే తరువాత ఒలంగా ఈ వార్తలను తప్పు అని.. హీత్ స్ట్రీక్ జీవించి ఉన్నాడని చెప్పాడు. అయితే ఈసారి జింబాబ్వే మాజీ కెప్టెన్ కన్నుమూసినట్లు అతని భార్య సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించింది.
Heath Streak: జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేసింది. హీత్ స్ట్రీక్ చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తను జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్రీ ఒలాంగా అందించాడు. అయితే తరువాత ఒలంగా ఈ వార్తలను తప్పు అని.. హీత్ స్ట్రీక్ జీవించి ఉన్నాడని చెప్పాడు. అయితే ఈసారి జింబాబ్వే మాజీ కెప్టెన్ కన్నుమూసినట్లు అతని భార్య సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించింది. సెప్టెంబరు 3న తెల్లవారుజామున హీత్ స్ట్రీక్ మరణించినట్లు అతని భార్య తెలిపింది. జింబాబ్వే మాజీ క్రికెటర్ జాన్ రైనీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. అతను స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ హీత్ స్ట్రీక్ మాతాబెలెలాండ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో మరణించాడని తెలిపాడు.
జింబాబ్వే జట్టుకు చెందిన ప్రముఖ క్రికెటర్లలో హీత్ స్ట్రీక్ ఒకరు. బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పే కీలకశక్తి అతని సొంతం. హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరపున 65 టెస్టు మ్యాచ్‌లు ఆడి 22.35 సగటుతో 1990 పరుగులు చేశాడు. టెస్టుల్లో 216 వికెట్లు కూడా తీశాడు. వన్డేల్లో హీత్ స్ట్రీక్ 2943 పరుగులు చేసి 239 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ తర్వాత జింబాబ్వే, బంగ్లాదేశ్‌లకు కోచ్‌గా పనిచేశాడు. దీంతోపాటు ఐపీఎల్లో కోచ్‌గా కూడా విధులు నిర్వహించాడు. ఐపీఎల్లో రెండుసార్లు విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్‌లో కూడా పాల్గొన్నాడు. అతను గుజరాత్ లయన్స్ బౌలింగ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. టెస్టులు, వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్. టెస్టుల్లో 100 వికెట్లు, 1000 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా జింబాబ్వే తరుఫున నిలిచాడు. ఇది కాకుండా తన దేశంలో వన్డేల్లో 200 వికెట్లు తీసి 2000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్. అతను 1993లో అరంగేట్రం చేశాడు. 1999-2000లో జట్టుకు కెప్టెన్ అయ్యాడు.