»Virat Kohli Kohli Is Going To Be A Father For The Second Time
Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న కోహ్లీ!
సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గురించి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని తెలియజేశాడు. కోహ్లీ అనుష్క దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
Virat Kohli: టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తన వ్యక్తిగత కారణాలవల్ల మ్యాచ్ లు ఆడడం లేదు అంటూ తనకు తానుగా తప్పుకున్నాడు. ఇండియా ఇంగ్లాండ్‌తో ఆడుతున్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల్లో భాగంగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇదిలా ఉండగా సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గురించి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని తెలియజేశాడు. కోహ్లీ అనుష్క దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తనతో సమయం గడపడానికే దూరంగా ఉన్నాడని తెలిపాడు.
ఫ్యామిలీతో టైం గడపడానికి కోహ్లీ ఆ మ్యాచ్‌లకు దూరమయ్యాడని డివిలియర్స్ తెలిపాడు. 2017లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2021లో వీరికి వామిక జన్మించింది. డివిలియర్స్, విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్.. వీరిద్దరూ ఆర్సీబీ టీమ్ తరఫున చాలా ఏళ్ల పాటు కలిసి ఆడారు. ఇకపోతే కోహ్లీ మూడవ టెస్ట్ మ్యాచ్ నుంచి ఆడతాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియాకి విరాట్ కోహ్లీ అవసరం అయితే ఉంది. ఆయన టీమ్‌లో లేకపోవడం వల్లే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అదే కోహ్లీ ఉంటే మాత్రం ఆ మ్యాచ్‌ని ఈజీగా గెలిపించేవాడు.