»Telangana Man Donates Blood To Pregnant Woman From Andhra With Rare Bombay Blood Group
Telangana: నర్సాపురం గర్భిణి ప్రాణాలు కాపాడిన తెలంగాణ యువకుడు
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన గర్భిణుకి ప్రాణం పోశాడు. డెలివరీ సమయానికి ఆమెకు రక్తం అవసరం అయ్యింది. అయితే ఆమెది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం దొరకడం కష్టమైంది. దీంతో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఆమెకు రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడారు.
Telangana: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ గర్భిణుకి తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రక్తం దానం చేశాడు. దీంతో ఆ గర్భిణి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. ఆమెకు పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత అరుదుగా ఉండే బోంబే బ్లడ్ గ్రూప్‌కి చెందిన రక్తం ఏపీలో నరసాపురం ప్రాంతానికి చెందిన మహిళలో ప్రవహిస్తోంది. మొగల్తూరు మండలానికి చెందిన ఈమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. డెలివరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ లోగా ఆమెకు రక్తం తక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. బ్లడ్ ఎక్కించాలని నిర్ణయించారు. ఆ సమయంలో ఆమెది బోంబే బ్లడ్ గ్రూప్ అని డాక్టర్లు గుర్తించారు.
డెలివరీ సమయంలో ఆమెకు మరింత బోంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరం అయింది. అరుదైన ఆ బ్లడ్ గ్రూప్ కలిగిన దాతలు ఏపీలో లభ్యం కాలేదు. రక్త దాతల కోసం అనేక విఫల ప్రయత్నాలు చేశారు. ఆన్లైన్లో కూడా ప్రయత్నం చేశారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజుకి తెలిసింది. ఆయన తన పరపతి ఉపయోగించి ఆమెకు సరిగ్గా సరిపోయే బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తి తెలంగాణలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతడి ద్వారా గర్భిణికి రక్త దానం చేయించారు.
భారత దేశంలో ప్రతి పది వేల మందిలో ఒకరు బోంబే బ్లడ్ గ్రూప్‌కి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. 1952లో బోంబేలో అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తిని గుర్తించారు. దీంతో ఆ బ్లడ్ గ్రూప్‌ను బోంబే బ్లడ్ గ్రూప్ అని పిలవడం ప్రారంభించారు. ఈ గ్రూప్ బ్లడ్ ఉన్న వారిని గుర్తించడం కూడా కష్టమే. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తేనే ఈ బ్లడ్ గ్రూప్‌ను గ్రహించగలుగుతాం. బోంబే బ్లడ్ గ్రూప్ కలిగిన వారి ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యూల్స్ తయారు కావని వైద్యులు చెబుతున్నారు.