Virat Kohli: కోహ్లీ బర్త్‌డే రోజు అనుష్క ఎమోషనల్ పోస్ట్
కోహ్లీ బర్త్ డే రోజు అనుష్క వర్మ స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే ఓ భావోద్వేగపు నోట్‌ను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క శర్మ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నేడు విరాట్ కోహ్లీ బర్త్ డే (Kohli Birth Day). ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి అభిమానులు, క్రికెట్ ప్రియులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న కోహ్లీకి సమీమణి అనుష్క శర్మ (Anuska Sharma) ఇన్‌స్టా వేదికగా స్పెషల్ విషెస్ (Special Wishesh) చెబుతూ ఓ భావోద్వేగా పోస్ట్ చేసింది. క్రికెటర్‌గా కోహ్లీ సాధించిన విజయాలను, కోహ్లీపై తనకున్న ప్రేమను అనుష్క శర్మ అక్షరరూపంలో చూపించింది. తన జీవితంలో కోహ్లీ ప్రాముఖ్యతను చాటిచెప్పింది.
జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ అనుష్క శర్మ ఇన్‌స్టాలో పోస్ట్ (Insta Post Viral) చేస్తూ తామిద్దరం కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. కోహ్లీ అసాధారణమైన వ్యక్తి అని , కొడుకుగా, భర్తగా, తండ్రిగా అన్ని పాత్రలలోనూ కోహ్లీ ప్రత్యేకత వేరని అనుష్క పొగడ్తలతో ముంచెత్తింది. ఈ జన్మలోనే కాకుండా ఆ తర్వాత కూడా కోహ్లీపై తనకున్న ప్రేమ అంతులేనిదంటూ అనుష్క (Anuska) తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లో కోహ్లీ ఒక్క బంతి కూడా వేయకుండానే వికెట్‌ను తీసిన ఒకే ఒక్కడు అంటూ అనుష్క తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. 2011లో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్ వేయగా అది వైడ్‌గా వెళ్లింది. అయితే క్రీజులో ఉన్న కెవిన్ పీటర్సన్ క్రీజు వదిలి ముందుకు వెళ్లడంతో ధోని స్టంపౌట్ చేశాడు. దీంతో బాల్ వేయకుండానే విరాట్ కోహ్లీ వికెట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ రోజు వన్డే వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడుతోంది. ఈ వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. అందుకే పుట్టిన రోజు నాడు శతకం చేసి సచిన్ రికార్డును అందుకోవాలని కోహ్లీ అభిమానులు కోరుతున్నారు. ఇకపోతే 2017 డిసెంబర్ 11న విరాట్, అనుష్క శర్మలకు వివాహం కాగా వారికి 2021 జనవరి 11న వామిక జన్మించింది.