»Happy Birthday Virat Kohli 2023 Even On The Death Of His Father
HappyBirthdayViratKohli: తండ్రి మరణ సమయంలో కూడా!
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి నేటితో 35 ఏళ్లు. ఈ వయసులోనే అనేక రికార్డులను అధిగమించాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ రికార్డులను సైతం బీట్ చేశాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తన గురించి పలు కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Happy Birthday Virat Kohli 2023 even on the death of his father
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)బర్త్ డే ఈరోజు. కోహ్లీ నవంబర్ 5, 1988న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. విరాట్ మధ్యప్రదేశ్‌లోని కట్నితో మంచి సంబంధాలు కల్గి ఉన్నాడు. విభజన సమయంలో విరాట్ తాత కట్నీకి వచ్చారు. ఆ క్రమంలో తర్వాత విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ కుటుంబంతో కలిసి ఢిల్లీకి వచ్చి సెటిల్ అయ్యారు. ఈ సందర్భంగా విరాట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
1. 19 డిసెంబర్ 2006న విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ 54 సంవత్సరాల వయసులో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించాడు. ఆ సమయంలో విరాట్ వయస్సు కేవలం 18 సంవత్సరాలు. అతను అప్పుడు ఢిల్లీలో రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఆ ఢిల్లీ మ్యాచ్ కర్ణాటకతో జరిగింది. ఢిల్లీని ఫాలోఆన్ నుంచి కాపాడేందుకు కోహ్లీ 90 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతే తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
2. విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత అండర్-19 జట్టు 2008లో ప్రపంచకప్ గెలిచింది. ఈ టోర్నీ మలేషియాలో జరిగింది. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత కోహ్లీ 18 ఆగస్టు 2008న శ్రీలంకపై టీమ్ ఇండియా తరపున తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
3. దేవధర్ ట్రోఫీ ఫైనల్లో జట్టుకు నాయకత్వం వహించిన రెండో అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2009-10 సీజన్ ఫైనల్లో నార్త్ జోన్‌కు నాయకత్వం వహించినప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాల 124 రోజులు. నాలుగేళ్ల క్రితం శుభ్‌మన్ గిల్ (20 ఏళ్ల 57 రోజులు) విరాట్ రికార్డును బద్దలు కొట్టాడు.
4. ఒక దశాబ్దంలో 20,000 అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. 35 ఏళ్ల విరాట్ 2019లో భారత వెస్టిండీస్ పర్యటనలో ఈ ఘనత సాధించాడు. ఆ పర్యటనలో వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో భారత క్రికెటర్ ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 99 బంతుల్లో అజేయంగా 114 పరుగులు చేశాడు.
5. వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ కూడా కోహ్లీనే కావడం విశేషం. 2018లో వెస్టిండీస్‌పై అజేయంగా 157 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించడానికి అతను 205 ఇన్నింగ్స్‌లు ఆడగా, సచిన్ టెండూల్కర్ 10,000 ODI పరుగులను చేరుకోవడానికి 259 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
6. మరోవైపు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అతను 11 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అతను 15 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన హషీమ్ ఆమ్లా రికార్డును బ్రేక్ చేశాడు.
7. రెండు జట్లపై వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు విరాట్ కోహ్లీ. ఫిబ్రవరి 2012, జూలై 2012 మధ్య శ్రీలంకపై కోహ్లీ 133*, 108, 106 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2018లో వెస్టిండీస్‌పై 140, 157*, 107 పరుగులు చేశాడు.
8. ఒక సంవత్సరంలో అన్ని ICC వార్షిక వ్యక్తిగత అవార్డులను గెలుచుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2018లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, కోహ్లీకి సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ICC టెస్ట్, ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయి.
9. కోహ్లి ఒక క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు ఎనిమిది సార్లు 1000 లేదా అంతకంటే ఎక్కువ ODI పరుగులు చేశాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లి 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023లో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ వన్డే పరుగులు చేశాడు.
10. ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్స్‌లో భారత్ ఔట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ ఈ క్రికెట్ మహాకుంభ్‌లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అతను ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్‌పై 82, 77, 67, 72 పరుగులు చేశాడు.
11. వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాల్లో 1000 పరుగులు చేసిన తొలి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ 2016లో 1215 పరుగులు, 2017లో 1059 పరుగులు, 2018లో 1322 పరుగులు చేశాడు.
12. కెప్టెన్‌గా అత్యంత వేగంగా 3000 వన్డేలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అతను ఈ ఘనతను సాధించడానికి 49 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ ప్రక్రియలో మాజీ RCB ఆటగాడు AB డివిలియర్స్, మాజీ భారత కెప్టెన్ MS ధోనీని బీట్ చేశాడు.