ICC వన్డే ప్రపంచ కప్ 2023లో నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠతో కూడిన మ్యాచ్ కాసేపట్లో జరగనుంది. అంతేకాదు ఈరోజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు అయిన నేపథ్యంలో కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్‌లో మొదలయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
team India vs South Africa 37th match kolkata Win Prediction
2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 37వ మ్యాచ్ కోల్‌కతా(kolkata)లోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్లో టీమిండియా(team india), దక్షిణాఫ్రికా(South Africa) జట్ల మధ్య కాసేపట్లో మొదలు కానుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అంతేకాదు రెండు జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా కొనసాగనుంది. మరోవైపు ఈరోజు విరాట్ కోహ్లీ(virat kohli) బర్త్ డే కావడం ఈ మ్యాచుపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా అద్భుత ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసింది. శ్రీలంకపై 428/5, ఆస్ట్రేలియాపై 311/7, ఇంగ్లండ్‌పై 399/7, బంగ్లాదేశ్‌పై 382/5, న్యూజిలాండ్‌పై 357/4 స్కోరు ఇది. అయితే ఈ జట్టు రెండో బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు (పాకిస్తాన్‌పై) 1 వికెట్ తేడాతో గెలిచారు. దానికి ముందు 38 పరుగుల తేడాతో (నెదర్లాండ్స్‌పై) ఓడిపోయారు. మరోవైపు భారత్ మాత్రం ఇప్పటి వరకు తిరుగులేని విధంగా ఏడు మ్యాచుల్లోను విజయం సాధించింది. మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా అద్భుతంగా ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు గతంలో 90 వన్డేలు ఆడాయి. అందులో దక్షిణాఫ్రికా 50, భారత్ 37 గెలిచాయి. మూడు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు రాలేదు. చివరిసారి (అక్టోబర్ 2022) ఈ రెండు జట్లు ఢిల్లీలో తలపడ్డాయి. ఈ రెండు జట్ల ప్రపంచకప్ రికార్డు సమతుల్యంగా ఉంది. వీరి మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా మూడుసార్లు, భారత్ రెండుసార్లు గెలిచాయి.
ఇక ఈడెన్ గార్డెన్స్ పీచ్ బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిచ్ నల్ల నేలతో ఉంటుంది. ఇది బ్యాటర్లకు మంచి బౌన్స్‌ను అందిస్తుంది. స్పిన్నర్లు, సీమర్లు తరచుగా ఇక్కడ మంచి స్పెల్లను ఆస్వాదిస్తారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన 33 వన్డేల్లో స్కోరును ఛేదించే క్రమంలో ఇప్పటివరకు 13 జట్లు గెలుపొందగా, తొలుత బ్యాటింగ్ చేసిన 19 జట్లు గెలిచాయి. ఎటువంటి ఫలితాలను ఇవ్వని ఒక మ్యాచ్ ఉంది. అయితే గూగుల్ విన్ ప్రాబబిలిటీ(Win Prediction) ప్రకారం ఈ మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాను ఓడించే అవకాశం 62% ఉంది. మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.