»Aussies Are Victorious England Is Out Of The World Cup
World Cup : ఆసీస్ అలవోకగా విజయకేతనం..వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ అవుట్
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.సెమీస్ రేస్ నుంచి డిఫెండింగ్ ఛాంప్ ఔట్
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా (Australia) వరుసగా ఐదో విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ 33 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో కంగారూలు సెమీస్ బెర్త్‌కు మరింత చేరువ కాగా.. ఇంగ్లండ్ (England) ఏడింట ఆరో ఓటమితో అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (71) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్మిత్ (44), గ్రీన్ (47), స్టోయినిస్ (35), జాంపా (29) కీలక పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4 వికెట్లు పడగొట్టాడు. చేజింగ్‌లో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ (64), మలాన్ (50), మోయిన్ అలీ (Moeen Ali) (42) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓ దశలో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తున్నట్టే కనిపించింది. అయితే జంపా బంతిని అందుకున్నాక పరిస్థితి మారిపోయింది. తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (1) వికెట్ తీసిన జంపా. ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయిన స్టోక్స్, మొయిన్ అలీలను కూడా పెవిలియన్ కు తిప్పిపంపాడు.
దాంతో ఇంగ్లండ్ ఓటమి బాటలోకి మళ్లింది. ఆసీస్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఆడమ్ జంపా (Adam Zampa) 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఆసీస్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకుంది. ఆసీస్ తదుపరి మ్యాచ్ లలో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో ఆడాలి. వీటిలో ఒక్క మ్యాచ్ లో గెలిచినా ఆసీస్ కు సెమీస్ బెర్తు లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసీస్ 7 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆసీస్… టీమిండియా, దక్షిణాఫ్రికా (South Africa) తర్వాత మూడో స్థానంలో ఉంది.అటు, ఇంగ్లండ్ ఆరో ఓటమితో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. డిఫెండింగ్ చాంపియన్ గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఇంత దారుణంగా ఆడుతుందని వరల్డ్ కప్ (World Cup) కు ముందు ఎవరూ అనుకుని ఉండరు. కానీ, భారత పిచ్ లపై చిన్న జట్లు రాణించిన చోట, ఇంగ్లండ్ ఘోర పరాజయాలు చవిచూసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది.