Madhya Pradesh Teacher: దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫీవర్ నెలకొంది. ఎన్నికలు అంటే అన్ని డిపార్ట్ మెంట్స్ కలిసి పనిచేయాలి. మధ్యప్రదేశ్‌లో ఓ టీచర్ ట్రైనింగ్‌కు రావాలని సమాచారం ఇస్తే రాలేదు. ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని కోరితే.. తలతిక్క సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన కలెక్టర్ సదరు టీచర్‌ను (Teacher) సస్పెండ్ చేశారు.
ఏం జరిగిందంటే..?
సాత్నా జిల్లాలో అఖిలేశ్ కుమార్ మిశ్రా (35) సంస్కృత టీచర్‌గా (Teacher) పనిచేస్తున్నాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. గత నెల 16, 17వ తేదీల్లో శిక్షణ తరగతులకు హాజరు కావాలని సమాచారం వచ్చింది. దానికి అతను డుమ్మా కొట్టారు. ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని కోరగా.. ఏదో సమస్య చెప్పి, పిచ్చిగా ప్రవర్తించాడు.
తనకు వయసు పెరుగుతుందని.. పెళ్లి కాలేదని చెబుతున్నాడు. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయం ఉంది. ముందు తనకు పెళ్లి చేయాలని కోరారు. తర్వాత ఎన్నికల విధులకు వస్తా అని నోటీసులకు సమాధానం ఇచ్చాడు. అంతేకాదు చివరలో తనకు రూ.3.5 లక్షల కట్నం, ఓ ప్లాట్ ఇవ్వాలని కూడా కోరారు. ఆ రిప్లై చూసిన కలెక్టర్‌కు మండింది. వెంటనే అతన్ని విధుల నుంచి తప్పించారు.
వాస్తవానికి ఈ నెల 2వ తేదీన అతనిని సస్పెండ్ చేశారు. గత ఏడాది నుంచి ఆ టీచర్ మొబైల్ వాడటం లేదు. దాంతో సస్పెండ్ అయిన విషయం కూడా తెలియదు. మరో ఉద్యోగి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. అతని మానసిక పరిస్థితి బాగోలేదని.. పెళ్లి కాలేదనే ఒత్తిడిలో ఉన్నారని తోటి ఉద్యోగి ఒకరు చెప్పారు. ఏదీ ఏమైనా కానీ.. ఎన్నికల విధులకు హాజరుకాక పోగా.. విచిత్రమైన సమాధానం ఇచ్చి సస్పెన్షన్‌కు గురయ్యాడు.