»Virat Kohli Kohli With Daughter Vamika In A London Cafe Photo Viral
Virat Kohli: కూతురు వామికతో లండన్ కేఫ్‌లో కోహ్లీ.. ఫొటో వైరల్
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ లండన్‌లో ఉంటున్నారు. తన కూతురు వామికతో కలిసి కేఫ్‌లో ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ లండన్‌లో ఉంటున్నారు. తన పర్సనల్ లైఫ్‌ని ప్రపంచానికి ఎప్పుడూ దూరంగానే ఉంచాలని విరాట్ దంపతులు భావించేవారు. వామిక పుట్టి మూడేళ్లు అవుతున్న ఇంకా తన ఫొటోని బయట ప్రపంచానికి చూపించలేదు. అయితే కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత కోహ్లీ ఫస్ట్ ఫొటో విడుదలైంది. అది కూడా కూతురు వామికతో కనిపించాడు.
లండన్‌లోని ఓ కేఫ్‌లో విరాట్ తన కూతురు వామికతో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో టేబుల్ వద్ద వామిక భోజనం చేస్తుండగా.. పక్కన కోహ్లీ కూర్చుని కనిపించాడు. అయితే తమ పిల్లల విషయంలో విరాట్ దంపతులు ఎప్పుడూ గోప్యత పాటించాలని అనుకున్నారు. అందుకే తన కుమార్తె వామికను కూడా మీడియాకి దూరంగా ఉంచారు. అయితే కొందరు కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. ఫొటోలో వామిక ముఖంపై ఎమోజీని ఉంచి పోస్ట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.