Mahalakshmi Scheme: రూ. 500 కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 6 గ్యారంటీలో భాగంగా అమలు చేస్తానన్న రూ. 500కే గ్యాస్ సిలిండర్ పేదలకు అందించేందుకు జీవోను జారీ చేసింది.
Mahalakshmi Scheme: రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు ఇస్తూ జీవోను జారీ చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని ప్రకటించింది. ఆ తరువాత కేవలం రేషన్ కార్డు ఉన్నవాళ్లే ఈ పథకానికి అర్హులు అని తేల్చింది. మొత్తం దేశంలో కోటీ 20 లక్షల కుటుంబాలు ఉండగా అందులో 89 లక్షల 99 వేల మంది కుటుంబాలకు రేషన్ కార్డు ఉంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు తొంబై వేల మంది లాభపడనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే 200 యూనిట్ల కరెంటును కూడా అమలు చేశారు. మొత్తం ఆరు గ్యారెంటీలలో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షాలు కొంత అసమ్మత్తిని వెలుబుచ్చుతున్నాయి. మొదట తెలంగాణ ప్రజలందరికీ అని చెప్పి ఇప్పుడు కేవలం రేషన్ కార్డు ఉన్నవాళ్లకే అనడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా మేజారిటీ ప్రజలకు లాభం చేకూరుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా గృహజ్యోతి పథం కోసం లబ్దిదారులు ఆశాభావంతో ఎదరుచూస్తున్నారు.