Raised gas cylinder. The hearts of the merchants are broken
Gas cylinder: హోటళ్లు, రెస్టారెంట్స్ ఇతర ఫుడ్ బిజినెస్‌లకు వాడే గ్యాస్ సిలిండర్ ధరకు కేంద్రం మరోసారి పెంచింది. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ (Commercial LPG cylinder) ధర పెరిగడంపై చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో దీని ధర రూ. 1795 గా ఉంది. రూ.25.50 పెరిగక మునుపు రూ.1,769.50 గా ఉండేది. అలాగే చెన్నైలో రూ.1,960.50, ముంబయిలో రూ.1,749, కోల్‌కతాలో రూ.1,911 పెరిగింది. ఈ ధరలు మార్చి 1 అర్థరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అలాగే కొనసాగుతున్నాయి.
విమాన ఇంధన (ATF) ధరలను సైతం ప్రభుత్వరంగ ఇంధన రిటైల్ సంస్థలు పెంచాయి. ఒక కిలో లీటర్‌పై రూ. 8900 లను పెంచారు. ఢిల్లీ, కోల్‌కతాలో దేశీయ విమానయాన సంస్థలకు కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,01,397 నుంచి రూ.8,900 పెరిగి రూ.1,10,297కు చేరింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. దీనికి దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై లాభాల పన్నును (Windfall Tax) ప్రభుత్వం పెంచడమే కారణం. టన్నుకు ప్రస్తుతం రూ.3,300 ఉండగా దాన్ని రూ.4,600 చేసింది.