KMR: హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, టాడీ డిపోలు బంద్ ఉండనున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర కోరారు.