తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చింది. న్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశారు. త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని కూడా అమలు చేయనుంది.
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చింది. గెలిచిన తర్వాత గ్యారంటీలను అమలు చేసే దిశగా పనిచేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశారు. త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని కూడా అమలు చేయనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించనున్నారు. వచ్చేనెల 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు.
నిన్న నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా రూ.4,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలసి సీఎం శంకుస్థాపన చేశారు. 3,083 మహిళా సంఘాలకు రూ.177 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో 18 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు.