మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు అవుతోంది. అందులో మరో స్కీం.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆ పథకం.. విధి, విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకం గురించి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని, ఎంపిక చేయనుంది.
Telangana Government To Look Forward To The Selection Of Beneficiaries Of Rs.500 Gas Connection
Rs.500 Gas Connection: మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు అవుతోంది. అందులో మరో స్కీం.. రూ.500కే (Rs.500 Gas) గ్యాస్ సిలిండర్.. ఆ పథకం.. విధి, విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకం గురించి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని, ఎంపిక చేస్తోంది.
తొలుత గ్యాస్ సిలిండర్ కనెక్షన్ (connection) మహిళల పేరు మీద ఉన్నవారికే అనే వార్తలు వచ్చాయి. అది అధికారికం కాదు.. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పథకం అందజేయాలని ప్రాథమికంగా భావించారు. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిందని తెలిసింది. పంపిణీలో అవకతవకలకు తావివ్వకుండా లబ్దిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించిందని సమాచారం. ఇదే అంశంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహిస్తారు.
కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారిని పరిగణలోకి తీసుకోరు
కొత్త రేషన్ పొందేవారు మాత్రం పథకానికి అర్హులు
ఏడాదికి రాయితీ సిలిండర్లపై తేలని లెక్క
రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు
రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.20 కోట్లు..
డేటాబేస్‌తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్లు మాత్రం 63.6 లక్షలు