»Treat Harry Brooke With Rasagullas Heres The Video
SRH : హ్యారీ బ్రూక్‌కు రసగుల్లాలతో ట్రీట్.. ఇదిగో వీడియో!
ఐపీఎల్ -2023 సీజన్లో అత్యంత ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brooke). సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు బ్రూక్‌ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్(IPL) -2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 3, 13 పరుగులతో బ్రూక్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో హ్యారీపై విమర్శలు వెల్లువెత్తాయి. 13కోట్లు వృథా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిసింది.
సన్ రైజర్స్ టీం (Sunrisers team) మ్యాచ్ తర్వాత టీమ్ మొత్తం సెలబ్రేషన్స్ (Celebrations) చేసుకుంది. జట్టు సభ్యులు హ్యారీ బ్రూక్(Harry Brooke) ను కేక్ తో ముంచెత్తారు. తర్వాత రసగుల్లా ట్రీట్ ఇచ్చారు. చిన్న బేసిన్ లో ఉన్న రసగుల్లా(Rasagulla)లను ఆస్వాదిస్తూ తిన్నాడు హ్యారీ బ్రూక్. ఇందుకు సంబంధించిన వీడియోను సన రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. స్వీట్ డ్రీమ్స్ అని క్యాప్షన్ ఇచ్చింది. తొలి మూడు మ్యాచ్ లలో నిరాశపరిచిన సన్ రైజర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్.. నిన్న జరిగిన మ్యాచ్ లో చితక్కొట్టాడు. తన రేటుకు ఏమాత్రం న్యాయం చేయలేక పోతున్నాడన్న విమర్శలను తిప్పికొడుతూ సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే ఈ సీజన్ లో తొలి శతకం సాధించాడు.
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్(Player of the Match)’’ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాళ్లలో హ్యారీ బ్రూక్ ఒకడు. ఈ ఇంగ్లండ్ యువ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగా అతడు ఆడటం లేదని విమర్శలు వచ్చాయి. తొలి మూడు మ్యాచ్ లలో13, 3, 13 చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తాయి. ‘ఇది పీఎస్ఎల్ కాదు బాబూ’ కొందరు ఎగతాళి చేశారు. శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్(Garden of Eden)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఐపీఎల్(IPL) లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు.సెంచరీతో వాటన్నింటికీ సమాధానం చెప్పాడు.