అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లు జూలై నెలలో వివాహం చేసుకోనున్నారు. పెళ్లికి ముందు అనేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జామ్‌నగర్‌లో ఓ ప్రీ వెడ్డింగ్ వేడుక చేపట్టిన అంబానీ కుటుంబం ఈ సారి మరింత వైభవోపేతంగా రెండో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఒక భారీ క్రూయిజ్‌లో ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Bollywood stars Enjoying at Ambani's pre-wedding celebrations
Anant Ambani: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లు జూలై నెలలో వివాహం చేసుకోనున్నారు. పెళ్లికి ముందు అనేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జామ్‌నగర్‌లో ఓ ప్రీ వెడ్డింగ్ వేడుక చేపట్టిన అంబానీ కుటుంబం ఈ సారి మరింత వైభవోపేతంగా రెండో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఒక భారీ క్రూయిజ్‌లో ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో జరిగే విశేషాలపై ఓ లుక్కేద్దాం. ముకేశ్ – నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాధికా మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది. జులై 12న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ ఫ్యామిలీ నిశ్చయించింది. ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్ ప్లాజా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. జూలై 12న జరిగే వేడుకలు శుభ్ వివాహ్ పేరిట జరగనున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూన్ 14న మంగళ్ ఉత్సవ్ పేరిట గ్రాండ్ రిసెప్షన్ జరగనున్నాయి. వివాహానికి ముందు మరోసారి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల.. ప్రీ వెడ్డిండ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, సారా అలీ ఖాన్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, రన్వీర్ సింగ్ తదితరులు ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరౌతున్నారు. వీరితో పాటు క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కూడా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెర్మనీకి హాజరౌతున్నట్లు తెలుస్తోంది. భారీ క్రూయిజ్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. గెస్టులందరూ ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ వరకు వెళ్లి తిరిగి వెనక్కి తిరిగి వస్తారు. పార్శీ, థాయ్, మెక్సికన్, జపనీస్ వంటకాలను వడ్డించనున్నారు. మొత్తం 800 మంది గెస్టుల సమక్షంలో జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలను నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలను హాజరయ్యే అతిధులెవ్వరూ ఫోన్లు తీసుకురాకూడదనే నియమం విధించారు. మే 29వ తేదీన ఇటలీ లో వేడుకలు మొదలుకాగా.. జూన్ 1న స్విట్జర్లాండ్ లో ముగియనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్ షిప్‌లోనే కొనసాగనున్నాయి.