Charminar : రంజాన్ సందర్భంగా చార్మినార్ వద్ద కోలాహలం
రంజాన్ (Ramzan 2023) వచ్చిందంటే చాలు.. హైదరాబాద్(Hyderabad)లోని అనేక వ్యాపార సముదాయాలు రద్దీగా మారిపోతుంటాయి. అయితే.. గత మూడేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా సరైన వ్యాపారాలు లేక నిరాశ చెందిన వారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.
రంజాన్ (Ramadan) పర్వదినం కోసం భాగ్యనగరం సిద్దమవుతోంది. పాత బస్తీ (old city) తో పాటు పలు ప్రాంతల్లో రంజాన్ షాపింగ్ పండుగ వాతావరణం నెలకొంది. మూడేళ్ల నుంచి కొవిడ్ (covid) ప్రభావంతో పండగ ఉత్సాహం అంతగా కనిపించకపోగా.. ఈ ఏడాది ముస్లిం వర్గాలు భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారు. రంజాన్ మాసం చివరి దశకు చేరిన నేపథ్యంలో 24 గంటలూ మార్కెట్లు కళకళ లాడుతున్నాయి. చార్మినార్ (Charminar) పరిసర ప్రాంతాలతో పాటు నాంపల్లి, అఫ్జల్‌గంజ్, మలక్‌పేట్, కాచిగూడ, సికింద్రాబాద్, టోలీచౌకీ, మెహిదీపట్నం, దిల్‌సుక్‌నగర్(Dilsuknagar), అమీర్‌పేట్ ప్రాంతాల్లో కూడా రంజాన్ కళ కనిపిస్తోంది. దుకానణాలో సందడి నెలకొంది. రంజాన్ సందర్భంగా పాతనగరంలోని మదీనా మార్కెట్ నుంచి పాతబస్తీ బస్తీల వరకు ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్‌కు దీటుగా, పోటీగా ఇతర దుకాణాల్లో వస్త్రాలు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారు.
దీంతో పాతబస్తీ వాసులు ఒకప్పుడు షాపింగ్ కోసం చార్మినార్‌కే వెళ్లేవారు. కొత్తగా వెలిసిన బస్తీ మార్కెట్లతో స్థానికులు చార్మినార్ మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లకు వెళుతున్నారు.చార్మినార్‌తో సంబంధం లేకుండా యాకుత్‌పురా(Yakutpura), బడాబజార్, ఫలక్‌నుమా, వట్టేపల్లి, నవాబ్సాబ్కుంటా, హుస్సేనీఆలం, సంతో్‌షనగర్, హఫీజ్‌బాబానగర్, చాంద్రాయణగుట్ట, బార్కాస్, శాలిబండ, బహదూర్‌పురా, రియాసత్‌నగర్, తలాబ్‌కట్ట, మొఘల్‌పురా, రెయిన్బజార్ల, నాంపల్లి, టోలీచౌకీ (Tolychowki) కూడళ్లు, రోడ్ల పక్కన దుస్తులు, పాదరక్షలు, గృహాలంకరణ సామగ్రితో కూడిన తాత్కాలిక షాపులు వెలిశాయి.ఇటీవల తెలంగాణలో తీసుకొచ్చిన కొత్త నిబంధనల మేరకు.. 24 గంటలపాటు వ్యాపారాలు కొనసాగించవచ్చు అనే నిబంధన నిజంగా వ్యాపారులకు ఈ రంజాన్ మాసంలో ఓ వరంలా మారనుంది. ఇక రంజాన్ మాసం చివరి వారంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. 24 గంటల సదుపాయం తమకు ఉపయోగపడుతుందని.. “ప్రజలు తమ ప్రార్థనలకు భంగం కలగకుండా.. షాపింగ్ (Shopping) కోసం ఏ సమయంలోనైనా వచ్చేందుకు వీలు కల్పించినట్లు అయ్యిందని” అని ఓల్డ్ సిటీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబిద్ మొహియుద్దీన్ చెప్పారు.