Vasant Panchami: బాసరలో వసంత పంచమి వేడుకలు.. విశిష్టత.. ప్రాధాన్యత
బాసరలో ప్రతీ ఏటా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఉదయం 3 గంటల నుంచే బాసర సరస్వతి ఆలయంలో పూజలు ప్రారంభం అయ్యాయి. వేల సంఖ్యలో పిల్లకు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపట్టారు. మరీ వసంత పంచమి విశిష్టత ఏంటో చూద్దాం.
Vasant Panchami: తెలంగాణలోని బాసర(Basara) జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి(Vasant Panchami) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని చేనేత పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసరలో ప్రతీ సంవత్సరం నిర్వహించే అక్షరాభ్యాస కార్యక్రమానికి పలు రాష్ట్రాలనుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకున వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు
మొదలయ్యాయి.
మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమి(Vasant Panchami) జరపడం శాస్త్రీయం. శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. దీన్ని భారతదేశం మొత్తం ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవని పూజిస్తారు. మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ రోజు రతీ మన్మథులను పూజించడం ద్వారా మాధవుడు(వసంతుడు) ఆనందం పొందుతాడు. అందుకే దీన్ని వసంత పంచమి అంటారు. ఇదే రోజు చిన్నారులు అక్షరాభ్యాసం చేయిస్తారు.