KCR said that Chalo Nalgonda Sabha is not a political assembly
KCR: నీళ్లకోసం ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాలు ఎలా ఉందో చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వవం వచ్చి రెండు నెలలు ముగిసింది. ఇప్పుడు మూడో నెల నడుస్తుంది ఇప్పటికీ వారు ప్రజల కోసం ఏం చేశారు. మనకు వచ్చే కృష్ణా జలాలు కేఆర్ఎంబీ(కృష్ణ రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు) కు అప్పగిస్తూ సంతకాలు పెట్టడం ఎంత హేయమైన చర్చో మీరు తెలుసుకోవాలి అని అన్నారు. కట్టే కాలేవరకు తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా లేచి కొట్లాడుతా కాని పిల్లిలా ఉండను అని అన్నారు. చలో నల్గొండ సభ ప్రకటించగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక ఓ తీర్మాణం పెట్టారు దానికి తల తోక లేదు అని పేర్కొన్నారు.
కేసీఆర్ దిగిపోగానే కరెంట్ ఎక్కడికి పోయింది. కరెంట్ మన హక్కు దాని కోసం మీరంత కొట్లాడాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు కరెంట్, సాగు నీళ్లు, తాగు నీళ్లు దేనిలో తక్కువ చేసిన చూస్తూ ఊరుకోము అని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టడం ఎప్పుడైన చూశామా అని ప్రశ్నించారు. రైతు బంధు ఇవ్వడం చేతకాకపోతే ఇవ్వకండి అంతే కానీ చెప్పుతో కొడుతా అనడంపై కేసీఆర్ విరుచుకుపడ్డాడు. రైతుల చెప్పులు ఇంకా బలంగా ఉంటాయి అన్నారు. కేసీఆర్ నల్గొండలో సభా అంటే అడ్డుకుంటాము అని అంటున్నారు. కేసీఆర్ను అడ్డుకునే గుండెలు మీకు ఉన్నయా అని ప్రశ్నించారు. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉంటే మేడిగడ్డకు పోవడంపై విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము కూడా వెళ్లి మీ బండారం బయట పెడుతాము అని కేసీఆర్ అన్నారు. ఓటమి, గెలుపులు సహజం అని మరోసారి డబుల్ స్పీడ్తో అధికారంలోకి వస్తాము అని కేసీఆర్ పేర్కొన్నారు.