»Harry Brook Who Scored A Century What Is Kkrs Target
SRH : సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బౌలర్లను వారి సొంతగడ్డపైనే చితక్కొట్టిన ఈ 24 ఏళ్ల కుర్రాడు హ్యారీ బ్రూక్ (Harry Brooke) కేవలం 55 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అన్ని రకాల క్రికెటింగ్ షాట్లు ఆడిన బ్రూక్ మొత్తం 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ (Umesh Yadav)బౌలింగ్ లో ఆఫ్ సైడ్ కొట్టిన సిక్సులు ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచాయి.
ఐపీఎల్ -16 (IPL 2023) లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి.. కోల్‌కతాకు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.. బ్యాటర్ హ్యారీ బ్రూక్(Harry Brooke) (100*) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. సెంచరీ పూర్తి చేశాడు. ఐదెన్ మార్క్రమ్(Markram) (50) హాఫ్ సెంచరీతో చెలరేగి పోయాడు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) (32) ఫర్వాలేదనిపించగా.. రాణిస్తారనుకున్న మయాంక్ అగర్వాల్(9), రాహుల్ త్రిపాఠి(9) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. క్లాసెన్(15*) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. వరుణ్ చక్రవర్తి (Varun Chakraborty) ఒక వికెట్ తీశాడు. వైఫల్యాలను దాటుకుంటూ.. భారీ స్కోర్ సాధించింది సన్‌రైజర్స్ జట్టు. మెరుపు షాట్లతో బ్యాటర్లు.. కోల్‌కతా (Kolkata) బౌలర్లకు చుక్కలు చుపించారు. అందులోనూ ఓపెనర్ హ్యారీ బ్రూక్.. వన్ మ్యాన్ షో(One man show) చూపించాడు. మ్యాచ్ ఆది నుంచి అంతం వరకు బౌండరీలతో మొత మోగించాడు. 12 ఫోర్లు, 3 సిక్సులతో.. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో మొదటి సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. మార్క్రమ్ కూడా దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోయాడు. ఇద్దరు దాదాపు సమానమైన స్ట్రైక్ రేటు(Strike rate)తో విధ్వంసకర ప్రదర్శన చేస్తూ.. ప్రేక్షకుల హార్ట్ బీట్ పేరిగేలా చేశారు. చివర్లో క్లాసెన్ కూడా 225 స్ట్రైక్ రేటుతో మెరుపు షాట్లు ఆడాడు. ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ (England) ఆటగాడు హ్యారీ బ్రూక్ కు లభించిన ధర రూ.13.25 కోట్లు. ఇంగ్లండ్ తరఫున బ్రూక్ వరుస సెంచరీలతో హోరెత్తించడంతో అతడి కోసం వేలంలో పోటీపడిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు దక్కించుకుంది. కానీ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయ్యాక బ్రూక్ వరుసగా విఫలం కావడంతో, అతడికి పెట్టిన రేటు సమంజసమేనా అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే, విమర్శలన్నీ ఇవాళ పటాపంచలయ్యాయి. బ్రూక్ తన ధరకు న్యాయం చేస్తూ సెంచరీతో చెలరేగిపోయాడు.