టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోర్టు షాకిచ్చింది. షమీ భార్య హసిన్ జహాన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ వ్యవహారంలో అలీపూర్ జిల్లా కోర్టు షమీ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ కు నెలవారీ భరణం కింద రూ.1 లక్ష 30 వేలు చెల్లించాలి. అందులో కూడా రూ.50 వేలను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగాను, ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె పోషణకు రూ.80 వేలు ఖర్చు చేయాలని కోర్టు ఆదేశించింది.
2018లో మహ్మద్ షమీ వేధిస్తున్నాడని అతని భార్య కోర్టును ఆశ్రయించింది. అప్పట్లో ఆమె తన కుమార్తె పోషణకు గాను నెలకు రూ.10 లక్షలు అందించాలని డిమాండ్ చేసింది. దీంతో షమీ వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రతినెలా తన భార్యకు భరణం కింద లక్ష 30 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.