»Shubman Gill And Sara Tendulkar Are Getting Married Soon Chirag Suri
Chirag Suri: సచిన్ కుమార్తె సారాకు త్వరలోనే పెళ్లి!
భారత స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వధువు ఎవరో కాదు. అందరు అనుకున్నట్లు సారా టెండూల్కర్ అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Shubman Gill and Sara Tendulkar are getting married soon. Chirag Suri
Chirag Suri: స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో నిలకడగా ఆడుతూ మంచి యావరేజ్‌ను మెంటైన్ చేస్తున్నాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారంలో ఉన్నారు. దీనికి కారణం మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతో నెట్టింట్లో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. గత కొంతకాలంగా సారా, శుభమన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. శుభమన్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సారా కనిపించి సందడి చేయడంతో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా గిల్-సారా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నరంటూ మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
శుభమన్ ఇటీవల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిల్‌కు లవ్ సింబల్‌తో సారా(Sara Tendulkar) కంగ్రాట్స్ చెప్పింది. దీంతో తమ రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చిందని అందరూ భావించారు. గిల్ సెంచరీ చేసిన తర్వాత తనదైన శైలిలో ప్రేక్షకులను పలకరించాడు. అదే సమయంలో సారా ఫుల్ జోష్‌లో కనిపించింది. వీటిన్నంటికి తోడు రీసెంట్గా గిల్- సారా రిలేషన్‌షిప్‌పై యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెక్స్ట్ పెళ్లిపీటలు ఎక్కబోయే స్టార్ క్రికెటర్ ఎవరనే ప్రశ్నకు శుభమన్ పేరు చెప్పాడు చిరాగ్(Chirag Suri). శుభ్‌మన్‌కు లవర్ ఉందని, ఆమె పేరు సారా అని తెలిపాడు. ఆమె ఎవరో కాదు సచిన్ టెండూల్కర్ కూతురు అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై సచిన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.