»Jeans And Kurta Pajama Are Also Prohibited In Kea Exams In Karnataka
KEA exams: ఈ పరీక్షల్లో జీన్స్, కుర్తా పైజామా కూడా నిషేధం
కర్ణాటకలో గత నెల 28వ తేదీన వివిధ కార్పొరేషన్ బోర్డుల్లో నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 18, 19 తేదీల్లో జరగనున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరీక్షలకు వచ్చే అభ్యర్థుల విషయంలో కఠిన నిబంధనలు జారీ చేశారు. ఈ ఎగ్జామ్ కోసం వచ్చే వారు బట్టల విషయంలో కూడా నిబంధనలు ప్రకటించారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Jeans and Kurta Pajama are also prohibited in KEA exams in karnataka
కర్ణాటకలో నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే రీ-ఎగ్జామినేషన్ కోసం కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA) కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ పరీక్షల కోసం వచ్చే అభ్యర్థులు ఎలాంటి తలపాగా, టోపీ లేదా తలను కప్పి ఉంచే ఎలాంటి వస్త్రాన్ని ధరించకూడదని తెలిపింది. అంతేకాదు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఫుల్ స్లీవ్ షర్టులు, పాకెట్స్ ఉన్న బట్టలు, కుర్తా పైజామా, జీన్స్ ధరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బట్టలు తేలికగా ఉండాలని, పెద్ద ఎంబ్రాయిడరీ, జిప్‌లు, పెద్ద బటన్లు ఉండకూడదని తెలిపింది. పరీక్షా కేంద్రం లోపల బూట్లు ధరించడం నిషేధమని వెల్లడించింది. అభ్యర్థులు లైట్ సోల్‌తో ఉన్న చెప్పులు ధరించవచ్చని పేర్కొంది.
With a view to curbing malpractices, The Karnataka Examination Authority (KEA) has banned all types of headcovers that may aid in facilitating cheating during the exams. This could also mean a ban on hijab.#hijab#KEA#KarnatakaExaminationAuthoritypic.twitter.com/FORc4RkL9V
ఇక మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, బొటనవేలు ఉంగరం మినహా మెడలో ఏదైనా ఆభరణం, ఇయర్ రింగ్ / స్టడ్, చేతి కడ లేదా వేలి ఉంగరం ధరించకూడదని ప్రకటించారు. ఇటీవల వివిధ విభాగాల్లో రిక్రూట్మెంట్ల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఈ నిబంధనలు కఠినతరం చేశారు. మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, రిస్ట్ వాచీలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఆహార వస్తువులు, పెన్సిల్, కాగితం, ఎరేజర్, జామెట్రీ బాక్స్, లాగ్ టేబుల్ కూడా నిషేధించామని అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి 25 మంది అభ్యర్థులకు ఒక పోలీసును నియమించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల ఎలాంటి వాహనాలను పార్కింగ్ చేయకుండా నిషేధించాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని KEA పోలీసు విభాగానికి లేఖలో అభ్యర్థించారు. మరోవైపు హోటళ్లలో తిరుగుతున్న వ్యక్తులు, అతిథి వసతి గృహాలు, హాస్టళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా కమీషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.