Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌పై భారీ జారిమాన విధించి ఐపీఎల్ యాజమాన్యం. మొత్తం టీం అంతా దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. గత రాత్రి సీఎస్కెతో జరిగిన ఉత్కంఠపోరులో జీటీ గెలిచింది.
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill)పై భారీ జరిమాన విధించింది ఐపీఎల్ బోర్డు. మొత్తం టీం అంతా కలపి రూ. 24 లక్షల ఫైన్ వేసింది. గత రాత్రి అహ్మాదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సీఎస్కె తలపడిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు 232 ను టార్గెట్‌గా ఇచ్చింది. తరువాత సీఎస్కె బ్యాటింగ్ చేసింది. ఎలాగైనా గెలవాలి అనే పంతంతో బౌలింగ్ ప్రదర్శించింది జీటీ టీమ్. ఈ నేపథ్యంలో నెమ్మదిగా బౌలింగ్ చేయడమే ఈ జరిమానాకు కారణం.
చెన్నై సూపర్ కింగ్స్‌తో స్లో ఓవర్ రేట్‌తో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ప్రదర్శించింది. ఈ తరహా స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం జీటీకి ఈ సీజన్లోనే ఇది రెండోసారి. దీంతో కెప్టెన్ శుభమన్ గిల్‌తో పాటు 11 మంది ప్లేయర్లకు ఈ ఫైన్ విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా ఈ ఫైన్ వర్తిస్తుండడం గమనార్హం. దీనిలో భాగంగా 11 మంది క్రికెటర్లకు ఆరు లక్షలు, లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్‌గా విధించారు. రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూల్ చేస్తారు. ఇక గత రాత్రి జరిగిని మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది. జీటీ ఓపెనర్స్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా చెరో సెంచరీ చేశారు. తరువాత బ్యాటింగ్ చేసిన సీఎస్కె చివరి వరకు ప్రయత్నించినప్పటికీ విజయాన్ని చేరుకోలేదు. దాంతో గుజరాత్ జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో, చెన్నై 12 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది.