ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023 )లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) జట్టుతో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) టీమ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఆటగాళ్లు హైదరాబాద్(Hyderabad)కు విచ్చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ సందర్భంగా ముంబయి ఇండియన్స్ సారథి అయిన రోహిత్ శర్మ (Rohit Sharma) వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.
రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియో :
ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముంబయి ఇండియన్స్(Mumbai Indians) ఆటగాళ్లు ఒక్కొక్కరూ ముందుకూ వెళ్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తెలుగులో మాట్లాడి సందడి చేశాడు. ప్రస్తుతం నెట్టింట దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ మాట్లాడుతూ ”మేం వచ్చేసినాము..ఎంఐ ఫ్యాన్స్ అంతా పదండి ఉప్పల్ కు” అంటూ సందేశం ఇచ్చాడు. రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
రోహిత్ శర్మ(Rohit Sharma) తెలుగులో మాట్లాడిన వీడియోను ముంబయి ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టు చేసింది. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ ఏపీకి చెందిన మహిళే కావడం గమనార్హం. పూర్ణిమ శర్మది విశాఖపట్నం కాగా ఆమె మహారాష్ట్రకు చెందిన గురునాథ్ శర్మను పెళ్లి చేసుకుని ముంబయిలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం రోహిత్ శర్మ(Rohit Sharma) తెలుగు వీడియో సందేశం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.