భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) కోలుకుని జిమ్లో జాయిన్ అయ్యాడు. అలాగే తాను జూనియర్లతో టేబుల్ టెన్నిస్ ఆడినట్లు ఇన్స్టాలో పంత్ వీడియోను షేర్ చేశాడు. గత ఏడాది రిషబ్ పంత్ కారు ప్రమాదాని(Car Accident)కి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పంత్ కు బలమైన గాయాలు అయ్యాయి. ఆ గాయల నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ (IPL 2023)కు రిషబ్ పంత్ దూరమయ్యాడు. అయినప్పటికీ తన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు(Delhi Capitals Team) క్రీడాకారులను ప్రోత్సహిస్తూ స్టేడియం వద్ద సందడి చేశాడు.
జూనియర్లతో టేబుల్ టెన్నిస్ ఆడిన రిషబ్ పంత్ వీడియో:
ఇప్పటి వరకూ రిషబ్ పంత్(Rishabh Pant) టీమిండియా(Team India)లో అన్ని ఫార్మాట్లలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023(IPL 2023)తో పాటుగా జూలైలో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా అతని సేవలను టీమిండియా కోల్పోయింది. పంత్ తిరిగి జట్టులోకి రావడానికి అధికారిక టైమ్ లైన్ అంటూ ఏదీ లేదు. అయితే అతను లేని లోటు అనేది టీమిండియాలో అలానే ఉంది.
25 ఏళ్ల రిషబ్ పంత్(Rishabh Pant) గాయం కారణంగా ఈ ఏడాది చివర్లో జరిగే ఆసియా కప్(Asia Cup), క్రికెట్ ప్రపంచ కప్ లో కూడా ఆడే అవకాశం లేదు. అందుకే రిషబ్ పంత్ త్వరగా కోలుకుని గ్రౌండ్ లో అడుగుపెట్టాలని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా రిషబ్ పంత్ జిమ్ లో దర్శనమిచ్చాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంత్ తెలిపాడు. అలాగే క్రికెటర్ల పునరావాస కేంద్రంలో రిషబ్ పంత్ జూనియర్లతో కలిసి టేబుల్ టెన్నిస్(Table tennis) ఆడాడు. ప్రస్తుతం పంత్ టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. చాలా రోజుల తర్వాత ఆడుతూ పంత్ కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.