»Rahul Dravid Reaction On Team India Lost T20 Series
Rahul dravid: విండీస్‌తో సిరీస్ లాస్.. కీలక విషయాలు నేర్చుకున్నాం
విండీస్ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నామని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. మరింత మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Rahul dravid Reaction on team india lost t20 series
Rahul dravid: విండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. కీలకమైన ఐదో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో చేతులెత్తేసింది. దీంతో మ్యాచ్ ఓడి.. సిరీస్ చేజార్చుకుంది. వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన విండీస్ చేతిలో భారత్ ఓడిపోవడం ఏంటీ అని.. సీనియర్లు గుర్రు మంటున్నారు. కెప్టెన్, కోచ్‌లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul dravid) స్పందించారు.
విండిస్‌తో టీ20 సిరీస్ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ సమస్య కనిపించిందని ద్రావిడ్ (Rahul dravid) అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్‌పై మరింత కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఎక్కడ మెరుగు పడాలనే అంశం తెలుసుకోగలిగాం అంటున్నారు. బ్యాటింగ్ డెప్త్ విషయంలో మరిన్ని ప్రయత్నాలు చేయాలని వివరించారు. బౌలింగ్ బలహీనంగా ఏమీ లేదని.. భవిష్యత్‌లో మ్యాచ్‌లు ఉన్నాయని తెలిపారు. భారీ స్కోర్లు జరుగుతుంటాయని.. లోతైన బ్యాటింగ్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందన్నారు. విండీస్ జట్టులో జోసెఫ్ లాస్ట్‌కు బ్యాటింగ్‌కు వచ్చి భారీ షాట్లు ఆడతాడని గుర్తుచేశారు.
టీమిండియా విషయం గురించి ద్రావిడ్ (Rahul dravid) ప్రస్తావించాడు. అక్షర్ పటేల్ (axar patel) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని.. తర్వాత చాహల్ (chahal), కుల్దీప్ (kuldeeo), అర్ష్‌దీప్, ముకేశ్ లాంటి టెయిలెండర్లు వస్తారని వివరించారు. విండీస్ సిచుయేషన్ వేరు అని.. జోసెఫ్ లాంటి బ్యాట్స్‌మెన్ చివరలో వచ్చి హిట్టింగ్ చేస్తారని అన్నారు. మనం కూడా అలాంటి పరిస్థితులకు అలవాటు పడాలని కోరారు. ఈ నెల 18వ తేదీన బూమ్రా నేతృత్వంలో ఐర్లాండ్‌తో 3 టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్ ఉన్న సంగతి తెలిసిందే.