కాకినాడ: కరప మండలం వేములవాడ, వాకాడ మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. చెట్టు కూలిపోయే సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, విద్యార్థులు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.