KDP: రాజంపేట అన్నమయ్య డ్యామ్ వద్ద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు బీటెక్ విద్యార్థులను మన్నూరు పోలీస్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రక్షించారు. రాత్రిపూట చీకటిలో నీటి ఉద్ధృతి పెరగడంతో విద్యార్థులు మధ్యలోనే ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు రాత్రంతా పహారా ఏర్పాటు చేసి సోమవారం ఉదయం నీరు తగ్గిన వెంటనే తాడు సహాయంతో ధైర్యవంతమైన ఆపరేషన్ ప్రారంభించారు.