BPT: దీపావళి సందర్భంగా చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను ఎస్సై శివకుమార్ ఇవాళ పరిశీలించారు. బాణసంచా దుకాణదారులు తీసుకున్న లైసెన్సులను పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇసుక, నీరు వంటివి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.