NLG: రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్టుగానే.. మనుషుల్లో అజ్ఞానమనే చీకటిని తొలగిస్తూ..జ్ఞాన వెలుగులు నింపే దీపాల పండుగ దీపావళి అని మంత్రి పేర్కొన్నారు.