VSP: విశాఖపట్నంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు ఉమాదేవి మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపు స్కూటీపై వెళ్తున్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పైడిరాజును ఆస్పత్రికి తరలించారు.