కాకినాడ: TDP అధికారంలో ఉన్నా జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి( కాకినాడ రూరల్), వర్మ (పిఠాపురం)కు కాలం కలిసిరాలేదనే చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా వారి స్థానాలను జనసేనకు కేటాయించగా, వారు విజయం సాధించారు. దీంతో వీరికి రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అనంతలక్ష్మి పార్టీకి గుడ్ బై చెప్పారు.