»Piloo Reporter India Former International Umpire Passes Away Aged 84
Piloo Reporter: మోస్ట్ సీనియర్ అంపైర్ కన్నుమూత.. 34 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైరింగ్
పిలు రిపోర్టర్ అంపైరింగ్ కెరీర్ 28 ఏళ్ల పాటు కొనసాగింది. 14 టెస్టులు, 22 ODIలతో సహా 34 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆయన అంపైరింగ్ చేశాడు. అంతర్జాతీయ అంపైరింగ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు పిలు రిపోర్టర్ విద్యుత్ శాఖలో పనిచేశారు.
Piloo Reporter: యావత్ క్రికెట్ ప్రపంచానికి నేడు విచారకరమైన రోజు. భారత మాజీ అంపైర్ పిలు రిపోర్టర్ కన్నుమూశారు. ప్రస్తుతం అయన వయసు 84సంవత్సరాలు. పిలు రిపోర్టర్ అంపైరింగ్ కెరీర్ 28 ఏళ్ల పాటు కొనసాగింది. 14 టెస్టులు, 22 ODIలతో సహా 34 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆయన అంపైరింగ్ చేశాడు. అంతర్జాతీయ అంపైరింగ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు పిలు రిపోర్టర్ విద్యుత్ శాఖలో పనిచేశారు. 1992 ప్రపంచ కప్‌లో అంపైర్‌గా పిలు రిపోర్టర్ పేర్గాంచారు. ఇది కాకుండా, అతను ప్రపంచంలోని మొట్టమొదటి న్యూట్రల్ అంపైరింగ్ పెయిర్లో కూడా సభ్యుడు. 1986లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఇద్దరు భారత అంపైర్లు పిలు రిపోర్టర్, వికె రామస్వామిని మాజీ పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అధికారికంగా వ్యవహరించడానికి ఆహ్వానించారు.
అంపైరింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందు పిలు రిపోర్టర్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ఉద్యోగం చేశారు. అదే సమయంలో బాంబే క్రికెట్ అసోసియేషన్ అంపైర్ కోసం ఒక ప్రకటన ఇచ్చింది. పిలు రిపోర్టర్ అంపైర్‌గా వ్యవహరించేందుకు అప్లై చేసుకున్నాడు. అయితే అప్పుడు అతను విజయం సాధించలేదు. అతను అంపైర్‌గా మారే పరీక్షలో విఫలమయ్యాడు. తరువాత అతను స్థానిక మ్యాచ్‌లలో చేరాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేయడానికి ముందు అతను రంజీ మ్యాచ్‌లకు కూడా అంపైరింగ్ చేశాడు.
క్రికెటర్ ఫౌండేషన్ నుంచి రూ.75 వేల సాయం
లక్నోలో 8 జనవరి 1993న ఇంగ్లండ్, బోర్డ్ ప్రెసిడెంట్స్ XI మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా పిలు రిపోర్టర్ అంపైరింగ్ చేశాడు. ఈ మ్యాచ్ 3 రోజుల పాటు సాగింది. రెండేళ్ల క్రితం పిలు రిపోర్టర్‌కు క్రికెటర్స్ ఫౌండేషన్ నుంచి రూ.75,000 సాయం అందింది. ముంబయి క్రికెట్లో అనూహ్య హీరోగా నిలిచాడు.