చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు
ఆసియా క్రిడాల్లో భారత్ సత్తా చాటుతుంది. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో బంగారు పతకం ఇండియాకు దక్కింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు భారత్ 14 పసిడి పతకాలను కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో టీమిండియా సత్తా చాటింది. టీ20లో నేపాల్ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరింది. భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగిస్తోంది. విత్యా రాంరాజ్ మహిళల 400 మీటర్ల హర్డిల్ రేసులో 55.42 స్కోరును నమోదు చేసి.. 1984 నాటి దిగ్గజ భారత అథ్లెట్ PT ఉష జాతీయ రికార్డును సమం చేసింది.
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో భారత్‌కు చెందిన అవినాష్ సేబుల్ 8:19:53 టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించడంలో విజయం సాధించింది.
ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆసియా గేమ్స్‌లో భారత్ నేడు మూడు పతకాలను సొంతం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత గోల్ఫ్‌లో భారత్ గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది.
వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటాడు
భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఆసియా గేమ్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ చైనా ఆటగాడితో పోటీపడనున్నారు.
ఈరోజు ప్రధానంగా ఆసియా క్రీడల్లో పాకిస్తాన్ ఓటమి, భారత్ గెలుపు అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం స్క్వాష్ ఫైనల్లో భారత్ గెలుపొందగా..తాజాగా హాకీలో కూడా పాకిస్తాన్ జట్టుపై 10-2 తేడాతో ఇండియా విజయం సాధించింది. అంతేకాదు SAFF U19 ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా భారత్..పాకిస్థాన్ టీంను ఇండియా ఓడించి గోల్డ్ గెల్చుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
ఆసియా క్రీడల్లో(asian games 2023) స్క్వాష్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను ఓడించి భారత్ స్వర్ణ పతకం గెల్చుకుంది. పాకిస్తాన్ జట్టును 2-1 తేడాతో ఓడించింది.
భారత్‌లో వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు వన్డేల్లో చాలా మంచి ఫామ్‌లో కనిపించింది. ప్రపంచకప్‌లో భారత్ నుంచి కూడా అభిమానులు ఇలాంటి మంచి ప్రదర్శన ఆశిస్తున్నారు.