టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. గ్రూప్ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇదే ప్రదర్శనను సూపర్-8లో కొనసాగిస్తామని పేర్కొన్నాడు. S-8లో ఈనెల 23న వెస్టిండీస్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
2008 ముంబై దాడుల తర్వాత 2009 నుంచి IPLలో పాక్ ప్లేయర్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్-‘ది హండ్రెడ్’లో కూడా పాక్ ప్లేయర్లను తీసుకునేందుకు 8 ఫ్రాంచైజీలలో 4 నిరాకరిస్తున్నాయట. ఈ MSG, MI లండన్, సథరన్ బ్రేవ్(క్యాపిటల్స్), సన్‌రైజర్స్ లీడ్స్‌లకు ఓనర్స్ IPL ఫ్రాంచైజీలే కావడం ఇందుకు కారణం. అందుకే SA20లోనూ నసీం షా, మహ్మద్ నవాజ్ మినహా ఎవరూ ఆడలేదు.
పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మాటలు నమ్మడం వల్లే T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిందని BCB జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ సంచలన ఆరోపణలు చేశారు. తమ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లామ్‌ను నఖ్వీ రెచ్చగొట్టారని.. ఆయన మాటలు విని ఎవరు మాత్రం గెలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా భారత్ తమ ప్లేయర్లకు సేఫ్ కాదంటూ బంగ్లా టోర్నీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.
నెదర్లాండ్స్‌పై శివమ్ దూబే తన అద్భుత ప్రదర్శన(66 రన్స్, 2 వికెట్లు)తో టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో IPLలో చూసినదాని కంటే దూబే ఆట చాలా అప్‌గ్రేడ్ అయిందంటూ క్రికెట్ దిగ్గజం క్రిస్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ టిప్స్, మ్యాచులు లేనప్పుడు ఆట మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న హోంవర్క్ అతనికి చాలా కలిసి వచ్చాయని పేర్కొన్నారు.
అఫ్గన్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఆయనకు ప్లేయర్లు భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు. జద్రాన్ తన POTM అవార్డును ట్రాట్‌కు అంకితం చేశాడు. ట్రాట్ నాలుగేళ్లుగా అఫ్గన్‌ను వెంటుండి నడిపారని, తొలి రోజు నుంచే తమను తీర్చిదిద్దారని నబీ ట్వీట్ చేశాడు. ట్రాట్ కోచింగ్‌లో అద్భుతంగా గడిపామని, ఆయన వెళ్లిపోవడం కష్టంగా ఉందని రషీద్ పేర్కొన్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి ‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో శ్రీలంక విసిరిన 119 రన్స్ లక్ష్యాన్ని మన అమ్మాయిలు 13.3 ఓవర్లలోనే ఛేదించారు. దినేష్ వృంద 42, అనుష్క శర్మ 27 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు, 28 పరుగులతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి జట్టు తుదిపోరుకు చేరడంలో కీలక పాత్ర పోషించింది.
T20 WCలో అభిషేక్ ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ కావడం అటు జట్టును, ఇటు క్రికెట్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతనికి కీలక సూచన చేశారు. తొలి బంతికి బౌండరీ కోసం కాకుండా సింగిల్‌కు ప్రయత్నించాలని, ప్రారంభంలో పరుగులు చేయకున్నా క్రీజులో నిలబడాలని సూచించారు. ఒక్కసారి స్థిరపడితే రన్స్ సునాయాసంగా పరుగులు వస్తాయని పేర్కొన్నారు.
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: సెమీస్‌లో భారత్ బౌలింగ్ ధాటికి శ్రీలంక బ్యాటర్లు తడబట్టారు. దీంతో ప్రత్యర్థి జట్టు 118 పరుగులకే పరిమితమైంది. యువ భారత్ తరఫున కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు తీయగా.. ప్రేమా రావత్, తనుజా కన్వర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీ ఫైనల్ చేరేందుకు టీమిండియా విజయ లక్ష్యం 126 రన్స్.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పెద్ద జట్లకు నెదర్లాండ్స్, స్కాట్లాండ్ తరఫున డచ్ ప్లేయర్ బాస్ డెలీడ్ కీలక విజ్ఞప్తి చేశాడు. పెద్ద టీమ్స్ ICC టోర్నీల్లో మినహా తమ నెదర్లాండ్స్ లాంటి అసోసియేట్ జట్లతో ఆడట్లేదని.. ద్వైపాక్షిక సిరీసులు కుదరకుంటే వార్మప్ మ్యాచులైనా ఆడాలని కోరాడు. దీంతో తమ ఆట మెరుగవుతుందని, జూన్‌లో వన్డే WC క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగే వరకు తాము ఖాళీనే అని పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్లు జట్టుగా సాధించలేనివెన్నో తాము చేశామన్న పాక్ ప్లేయర్ షదాబ్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ.. ‘షదాబ్ చెప్పినట్లే మేం టీమిండియాను ఓడించలేకపోయాం. కానీ ఆ విజయంతో పొందిన గౌరవాన్ని వాళ్లు కాపాడుకోలేకపోయారు. బాగా ఆడనప్పుడే మేం విమర్శిస్తాం. జట్టు నుంచి తొలగించినప్పుడు మేమే మద్దతుగా నిలిచామని గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నాడు.
అఫ్గనిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ నిన్న కెనడాపై 4/7 ప్రదర్శనతో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ICC ఈవెంట్స్(T20 లేదా ODI)లో అత్యధికంగా 41 ఏళ్ల 49 రోజుల వయసులో 4 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అఫ్గన్ తరఫున 152 T20 మ్యాచులాడిన నబీకి పొట్టి ఫార్మాట్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
శ్రీలంకతో జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్సీ తొలి సెమీస్‌లో భారత్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ అనుష్క సంజీవని ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గత టోర్నీ(2023)లో ఇదే జట్ల మధ్య తొలి సెమీస్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. గ్రూప్ దశలో రన్‌రేట్ ఆధారంగా భారత్ నాటి టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో జట్టును T20 WCలో సూపర్-8కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యధికంగా 19 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ టీమిండియా కెప్టెన్ సూర్య(17), అంతకుముందు విరాట్ కోహ్లీ(16) పేరిట ఉండేది.
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా ఇవాళ జరిగే తొలి సెమీస్‌లో భారత్, శ్రీలంక ఢీకొననున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కు బ్యాంకాక్ టెర్థాయ్ గ్రౌండ్ వేదిక కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇదే మైదానంలో బంగ్లా-A, పాక్-A మధ్య రెండో సెమీస్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. ఈ పోరులో ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేసి.. అతడి స్థానంలో అక్షర్‌కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. అలాగే, సుందర్‌ను కొనసాగించే ఛాన్స్ ఉందన్నాడు.