గౌతమ్ గంభీర్(gautam gambhir) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో చేరుతున్నట్లు ప్రకటించారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోడీ వెళ్లకపోయి ఉంటే.. భారత్ కప్ గెలిచేందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లను బీజేపీ నేతలు తప్పు పట్టారు.
క్రికెట్ ఆటలో మరో కొత్త రూల్ వచ్చింది. స్టాప్ క్లాక్ విధానంలో ఈ రూల్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది. బౌలింగ్ వేసే సమయంలో ఒక ఓవర్‌కు మరో ఓవర్ మధ్య 60 సెకన్లలోపే సమయం ఉండాలి. అలా 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే 5 పరుగులు పెనాల్టీ వేయనున్నట్లు ఐసీసీ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
వరల్డ్ కప్ ఓడిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అంతా బోరుమని ఏడ్చేశారు. రోహిత్ శర్మ ఏడ్చిన వీడియో వైరల్ అయ్యింది. మీరు చక్కగా ఆడారు.. టఫ్ ఇచ్చారని ప్రముఖులు చెబుతున్నారు. ధైర్యంగా ఉండు రోహిత్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే జట్టులో సంజూ శాంసన్, చాహల్, భువనేశ్వర్ వంటివారికి చోటివ్వకపోవడం పట్ల పలువురు క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో నిన్న భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆస్ట్రేలియన్ కెప్టెన్, పాట్ కమ్మిన్స్ మిచెల్ మార్ష్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ind Vs Aus ప్రపంచ కప్ 2023 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఈ మ్యాచులో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ODI ప్రపంచ కప్ ట్రోఫీని గెల్చుకుంది. ఈ నేపథ్యంలో అనేక మంది భారత అభిమానులు భారత ఆటాగళ్ల ఆటతీరుపై విమర్శళు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఇండియా బ్యాంటిగ్ తీరును మెచ్చుకుంటున్నారు.
వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే సమయంలో కింగ్ కోహ్లీ వద్దకు పాలస్తీనా మద్దతుదారుడు దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేడియం సిబ్బంది వచ్చి అతనిని బయటకు తీసుకెళ్లారు.
వన్డే వరల్డ్ కప్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల మోత కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.