»Satyanadella Stayed Up All Night For The India Vs New Zealand Match
Satyanadella: భారత్ కిివీస్ ఉత్కంఠ పోరు కోసం రాత్రంత మేల్కొని ఉన్నా
ముంబాయి వాంఖడే వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం భారతీయులు ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. అందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారట. ఆట కోసం రాత్రంతా మేల్కొనే ఉన్నారని తెలిపారు.
Satyanadella stayed up all night for the India vs New Zealand match
Satyanadella: వన్డే వరల్డ్‌కప్(World Cup 2023)లో భారత్(Team India) ఫైనల్‌కు చేరింది. ముంబాయి వాంఖడే వేదికగా జరిగిన ఉత్కంఠపోరులో కివీస్‌ను చిత్తు చేసింది. దేశంలోని క్రికెట్ అభిమానులు అందరూ రాత్రి టీవీలకు, మొబైైల్స్కు అతుక్కుపోయారు. ఇదే వరుసలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల(Satyanadella) కూడా ఉన్నారట. రాత్రంతా మెల్కొనే ఉన్నానని తెలిపారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ వరుసగా మ్యాచ్‌లు గెలుస్తున్నారు భారత ఆటగాళ్లు.
సియోటల్లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన తరువాత ఇంటికి వచ్చి మ్యాచ్‌లో మునిగిపోయారట. ఇక రాత్రంతా ఇండియా గెలుపు కోసం ఎదురుచూశానని, చివరికి అది నెరవేరడంతో ఆనందంగా ఉందని సత్య నాదెళ్ల తెలిపారు. ఇగ్నైట్ పేరుతో నిర్వహించిన కాన్పరెన్స్ షెడ్యూల్ చేసిన సమయంలో మ్యాచ్ ఉన్న విషయాన్ని మరిచిపోయినట్లు చెప్పారు. ఇక భారత్ అద్భతమైన విజయాలను సొంతం చేసుకుంటూ ఫైనల్‌కు చేరిందని, అక్కడ కూడా తిరుగులేని ప్రదర్శనను కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణిత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. తరువాత బౌలింగ్‌లోనూ విజృంభించింది. పేసర్ మహ్మాద్ షమీ బంతి వేగానికి కివీస్ 7 వికెట్లు కుప్పకూలాయి. మొత్తానికి బుధవారం రాత్రి ముంబాయి వేదికగా దిగ్విజయాన్ని నమోదు చేసుకుంది.