»A Netizen Who Said A Day Earlier That Shami Will Take 7 Wickets The Post Went Viral
Shami: షమీ 7 వికెట్లు తీస్తాడని ఒక రోజు ముందే చెప్పిన నెటిజన్..పోస్ట్ వైరల్
నిన్న జరిగిన మ్యాచ్‌లో షమీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే షమీ 7 వికెట్లు తీస్తాడని ముందు రోజే ఓ నెటిజన్ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టుకు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అద్భత బౌలింగ్ చేశాడు. ఏకంగా 7 వికెట్లను పడగొట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత విజయంలో మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
7 వికెట్లు సాధించి టీమిండియాకు విజయాన్ని అందించడంతో దేశ వ్యాప్తంగా షమీ హీరో అయిపోయాడు. అయితే షమీ ఇలా 7 వికెట్లు పడగొడతాడని ఓ నెటిజన్ ముందు రోజే చెప్పాడు. దానికి సంబంధించి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ జరగడానికి ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 14వ తేదిన షమీ 7 వికెట్లు తీస్తాడని ‘డాన్ మ్యాటియో’ అనే ప్రొఫైల్ నుంచి ట్వీట్ పోస్టు అయ్యింది. ఆ ట్వీట్‌కు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
మహ్మద్ షమీ 7 వికెట్లు తీస్తాడని తనకు కల వచ్చినట్లుగా ‘డాన్ మ్యాటియో’ తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నిన్నటి మ్యాచ్‌లో షమీ 7 వికెట్లు తీయడమే కాకుండా ఈ ప్రపంచ కప్‌లో 6 మ్యాచుల్లో ఏకంగా 23 వికెట్లను తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో షమీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వన్డే ప్రపంచ కప్‌లో 50 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. సుధీర్ఘకాలం తర్వాత జహీర్ ఖాన్ రికార్డును షమీ బ్రేక్ చేశాడు.