VZM: ఈ చిత్రంలో కనిపిస్తున్నది.. కురుపాం మండలంలోని గిరిశిఖర గ్రామమైన జరడ రోడ్డు. దారి పొడవునా ఇలా రాళ్లు తేలిపోయి ఉండడంతో ప్రయాణం నరకప్రాయంగా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీలకంఠాపురం నుంచి జరడ గ్రామం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైఅధ్వానంగా ఉండడంతో 12 గ్రామాల ప్రజలు ఈ మార్గంలో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. రోడ్డు బాగు చేయాలని కోరారు.