»That Change In The Indian Team Ashwins Arrival In The Team Is Certain
World Cup : భారత జట్టులో ఆ మార్పు..టీంలోకి అశ్విన్ రాక ఖాయమేనా !
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది. ప్రపంచ క్రికెట్ కప్ గెలుపొందిన జట్టుకు రూ.33 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 16.64 కోట్ల రూపాయల బహుమతిని అందజేయనున్నారు.
వరల్డ్ కప్ 2023 (World Cup 2023) ఫైనల్ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని టీం యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పిచ్ స్పిన్‌కు అనుకూలించే ఛాన్స్ ఉండటంతో అశ్విన్(Ashwin)ని తీసుకుంటున్నట్లు టాక్. లోయర్ మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే విన్నింగ్ టీం కాంబినేషన్ మార్చే అవకాశం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం(Modi Stadium)లో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. అయిదు పిచ్‌లను నల్లమట్టితో తయారు చేయగా.. మిగిలిన ఆరు పిచ్‌లను ఎర్రమట్టితో తయారు చేశారు. ఫైనల్‌కు ఎంపిక చేసే పిచ్ (Pitch) నలమట్టిదే అని తేలిపోయింది.
నల్లమట్టి పిచ్‌లపై స్పిన్(Spin)కు ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్ నల్లమట్టి పిచ్‌పైనే జరిగే అవకాశముంది. స్పిన్‌కు అనుకూలించే వికెట్ సిద్ధం చేశారనే వార్తలు బలంగా వస్తున్నాయి. వికెట్ కనుక స్పిన్‌కు అనుకూలిస్తే టీమిండియాది ఒకింత పైచేయి కానుంది. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే తుది జట్టులోకి మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్‌కు ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది సూచిస్తున్నారు.బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) జట్టుకు మెరుపు ఆరంభాలను ఇస్తుండగా.. శుభ్‌మన్ గిల్ మంచి టచ్‌లో ఉన్నాడు. ఇక టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్‌లో ఉండగా.. మిడిలార్డర్లో శ్రేయస్, రాహుల్ కీలకం కానున్నారు.
సూర్యకుమార్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా.. అతడికి అవకాశం రాకుండా టాపార్డరే పని ముగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. లేటుగా జట్టులోకి వచ్చిన షమీ ఫుల్ ఫామ్ ఉంటే.. బుమ్రా(Bumrah), సిరాజ్ అతడికి సహకరిస్తున్నారు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తే.. కుల్దీప్, జడేజా నుంచి ప్రత్యర్థులకు తిప్పలు తప్పకపోవచ్చు. మరోవైపు పోరాటానికి మారుపేరైన ఆస్ట్రేలియా కూడా బలంగా ఉంది. వార్నర్, హెడ్, మార్ష్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్ (Maxwell) రూపంలో వారికి శత్రు దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు స్టార్క్, హజిల్‌వుడ్, జాంపాను ఎదుర్కోవడం శక్తికి మించిన పనే.