తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం (Kolhapur Constituency) ఇండిపెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్నె శిరీషకు అనహ్యంగా మద్దతు పెరుగుతోంది. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిస్తున్నాయి. తాజాగా.. పుదుచ్చేరి మాజీ మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాం వాసి మల్లాడి కృష్ణారావు (Malladi Krishna Rao) ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె ప్రచారానికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ చేసింది. చదువుకున్నా జాబ్ (JOBS) రాకపోవడంతో గేదెలు కాస్తుండటంతో బర్రెలక్కగా పేరుపొందిందని, కులమతాలకు అతీతంగా ధన ప్రభావం లేకుండా యువత ఎన్నికల్లో పోటీచేసి గెలవాలన్న లక్ష్యంతో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారని, ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపానని మల్లాడి కృష్ణారావు తెలిపారు.
సామాజిక మాధ్యమాల ద్వారా యువత సహకారంతో ఆమెను గెలిపించాలన్నారు. ఫలితం ఎలా వచ్చినా.. నిరుత్సాహపడొద్దని, బీఈడీ వంటి కోర్సులు చదువుకోవాలని, పోటీ పరీక్షలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే తాను అండగా నిలుస్తానన్నారు. ఎంత చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో గేదెలు (Buffaloes) కాస్తుండటంతో బర్రెలక్కగా పేరుపొందింది. ఎన్ని డిగ్రీలు చేసినా.. ఉద్యోగాలు రావటం లేదని అందుకే బర్రెలు కాస్తున్నానంటూ ఆమె చేసిన ఓ రీల్(Reel)ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమెపు కేసులు నమోదు కాగా.. కోర్టుల చుట్టూ తిరిగుతోంది. ఆ కసితోనే తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు శిరీష వెల్లడించారు. అయితే అనుహ్యంగా బర్రెలక్కకు మద్దతు పెరుగుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఆమె గెలుపోటములు ప్రభావితం చేసేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.