»Icc World Cup 2023 Final Match In Ahmedabad Hotel Rates Increase November 19th 2023
Hotel: హోటల్లో ఒక్క రోజుకే రూ.2 లక్షలు..కారణమిదే!
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో విమాన టిక్కెట్ల రేట్లతోపాటు హోటళ్లలో రూముల ధరలు(hotel rates) కూడా అమాంతం 100 నుంచి 200 రెట్లు పెరిగిపోయాయని అక్కడి జనం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరాత్రికి స్టార్ హోటళ్లలో ఎంత ధరలు పెరిగాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
icc final match in ahmedabad hotel rates increase november 19th 2023
న్యూజిలాండ్‌పై భారత్(bharat) అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, నవంబర్ 19న అహ్మదాబాద్(ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అంతేకాదు ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లైవ్‌లో చూడాలని అనేక మంది క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ వెళ్లి అక్కడ జరిగే ICC ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజుకు అక్కడి హోటళ్ల రేట్ల తెలిసిన పలువురు షాక్ అవుతున్నారు.
భారత్‌ను ఉత్సాహపరిచేందుకు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ప్లాన్ చేయడంతో, రాబోయే రెండు రోజులలో హోటల్ ధరలు(hotel rates) నగరానికి ప్రయాణ టిక్కెట్లు అసాధారణంగా పెరిగాయి. ఓ హోటల్ గది సగటు ధర ఒక రాత్రికి దాదాపు రూ.10,000 వరకు ఉండగా…అహ్మదాబాద్‌లో నాలుగు, ఐదు నక్షత్రాల హోటల్లో ఒక రాత్రి గడపడానికి లక్ష వరకు ఖర్చవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే భారత్ మ్యాచ్ ప్రకటించినప్పటి నుంచి నగరంలో వసతి గృహాల ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు.
అంతేకాకుండా, ప్రపంచ కప్ ఫైనల్‌కు సమీపంలో ఉన్న తేదీల కోసం అహ్మదాబాద్‌కు విమాన టిక్కెట్ల ధర కూడా 100 రెట్లు(100 times) పెరిగిందని వెల్లడించారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు ఒక నెల క్రితమే తమ స్థానాలను పొందడం కోసం బుకింగ్స్ మొదలయ్యాయని అంటున్నారు. అక్టోబర్‌లో ఓ లగ్జరీ హోటల్లో టిక్కెట్ ధరలు ఒక రాత్రికి రూ.24,000 ఉండగా..అవి ప్రస్తుతం రూ.2,15,000 వరకు పెరిగాయని మనీకంట్రోల్ నివేదించింది. Booking.com, MakeMyTrip, Agoda వంటి హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో హోటల్ రేట్లు భారీగా పెరిగాయని బుక్ చేసుకున్నవారు చెబుతున్నారు.