»Preparations For World Cup Under Two Years Rohit Sharma
World Cup కోసం రెండేళ్ల నుంచి సన్నాహాలు: రోహిత్ శర్మ
వరల్డ్ కప్ కోసం రెండేళ్ల కింద నుంచి సన్నాహాలు చేస్తున్నానని రోహిత్ శర్మ మీడియాతో చెప్పారు. జట్టు విజయానికి కారణం కోచ్ ద్రావిడ్ అని.. అతను ఆటగాళ్లకు స్వేచ్చను ఇచ్చి.. ప్రోత్సహిస్తాడని తెలిపారు.
Preparations for World Cup under two years: Rohit Sharma
Rohit Sharma: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ అనగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మీడియాతో మాట్లాడారు. మ్యాచ్, ఆటగాళ్ల గురించి, కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
తమ బృందంలో ద్రావిడ్ రోల్ కీలకం అని చెప్పారు. ప్లేయర్స్ బాధ్యత నెరవేర్చేలా సన్నద్ధం చేయడంతోపాటు.. స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఆయన పాత్ర అమోఘం అని పేర్కొన్నారు. గత ఏడాది టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లకు ద్రావిడ్ అండగా నిలిచాడని పేర్కొన్నారు..
ద్రావిడ్‌తో కలిసి తాను జట్టులో మంచి వాతావరణం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆటగాళ్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2011లో తన వరకు కష్ట సమయం అని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో భారత జట్టును లీడ్ చేస్తానని ఎప్పుడూ అనేకోలేదన్నారు.
వరల్డ్ కప్‌లో 23 వికెట్లు తీసిన షమీ గురించి రోహిత్ (Rohit) ప్రత్యేకంగా మాట్లాడారు. టోర్నీ తొలినాళ్లలో షమీని తీసుకోకపోవడం కఠినమైన అంశం అన్నారు. ఆ సమయంలో షమీ, సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచాడని వివరించారు. నెట్స్‌లో షమీ తన బౌలింగ్‌ను మరింత సాన బెట్టుకున్నాడని తెలిపారు. వరల్డ్ కప్ ఫైనల్ కోసం గత రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని రోహిత్ శర్మ తెలిపారు.