»Ind Vs Nz Team India Explodes At Wankhede Kiwis Target 398
IND vs NZ: వాంఖడేలో చెలరేగిన టీమిండియా.. కివీస్ టార్గెట్ 398
వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా చెలరేగింది. 397 పరుగులు చేసి విజృంభించింది. ఈ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లి రికార్డులు క్రియేట్ చేశారు. సిక్సులు, ఫోర్ల మోతతో న్యూజిలాండ్ ముందు 398 పరుగుల టార్గెట్ నిలిచింది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలి సెమీ ఫైనల్స్‌లో టీమిండియా 390 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా టీమిండియా ఎదుర్కొంది. టాపార్డర్ విజృంభించడంతో భారత్… పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 51వ సిక్సర్ కొట్టి రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు ఆ రికార్డు 49 సిక్సులతో వెస్డిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పై ఉండేది.
మ్యాచ్‌లో 47 పరుగులకు రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ విజృంభించాడు. అయితే 79 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. క్రాంప్ కారణంగా గిల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో శ్రేయస్ అయ్యర్ చెలరేగాడు. విరాట్ కోహ్లీ 117 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 50వ సెంచరీని నమోదు చేసి సెంచరీల వీరుడిగా రికార్డుకెక్కాడు.
ఆ తర్వాత 70 బంతుల్లో 105 పరుగులకు శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 39 పరుగులకు నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. 4వ వికెట్ తర్వాత శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. శుభ్‌మన్ గిల్ 66 బంతులకు 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 397 పరుగులకు భారత్ ఇన్నింగ్స్ పూర్తయ్యింది. ఓ వైపు సిక్సులు, మరో ఫోర్లతో వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ 3, బౌల్డ్ ఒక వికెట్ పడగొట్టారు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముందు 398 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.